రాజన్న సిరిసిల్ల, తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09/
తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు వంద శాతం సంరక్షించబడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ జిల్లాలోని రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కల సంరక్షణ కొరకు ప్రత్యేకముగా నియామకం చేసిన మండల స్థాయి ఇంచార్జ్ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంనుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంచార్జ్ అధికారులు వారికి కేటాయించిన రహదారులను పరిశీలించి వెంటనే తగు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల కిరువైపుల పిచ్చి మొక్కలను తొలగించడం, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించడము, ట్రీ గార్డ్ లను సరిచేయించడం, ప్రతి రోజు వాటరింగ్ చేసి విధంగా ఇంచార్జ్ అధికారులను చూడాలన్నారు. ఉపాధి హామిలో మంజూరు కాబడిన సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సిఇఓ గౌతం రెడ్డి, డిఆర్డీవో కౌటిల్య, డిపివో రవిందర్, పంచాయతీరాజ్ ఇఇ సూర్య ప్రకాష్, అదనపు డిఆర్డీవో మదన్ మోహన్, ఏపీడి నర్సింహులు, అన్ని మండలాల ఎంపిడివోలు, ఇంచార్ట్ అధికారులను పాల్గొన్నారు.
