మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశం లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో గౌరవ ఆనాటి సీఎం కేసిఆర్ , యకత్వంలో ఎమ్మెల్యే*ఉన్నప్పుడు మంజూరు చేపించిన
*పాత మంచిర్యాల నుండి ఓవర్ బ్రిడ్జి వరకు*
రోడ్డుకి ఇరువైపులా వెడల్పు,డివైడర్ , సెంట్రల్ లైటింగ్
*ఓవర్ బ్రిడ్జి నుండి తోళ్లవాగు వరకు*.
రోడ్డు వెడల్పు,సెంట్రల్ లైటింగ్ మరియు ,రోడ్డు కి ఇరువైపులా డ్రైన్,బ్రిడ్జి పైన Hyperplas Polyster 6mm Sheet వేసి డంబర్ రోడ్ వేయడం..
*తోళ్లవాగు నుండి రసూలుపల్లె వరకు*.
సెంట్రల్ లైటింగ్ ,రోడ్డు వెడల్పు,
ఫారెస్ట్ క్లియరెన్స్ మినహా దాదాపు పనులు పూర్తి అయినాయి…
*ఐబి నుండి బెల్లంపెల్లి వరకు*
ఓల్డ్ R&B రోడ్ ని స్త్రెంగ్తెనింగ్ (బలపరుచుటకి) చేయడం కోసం …
*ఐబి నుండి శ్రీనివాస గార్డెన్* వరకు డ్రైన్ ,డివైడర్,సెంట్రల్ లైటింగ్ పనులు
అలాగే ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ మంచిర్యాలకు స్పెషల్ డెవలప్ ఫండ్ కింద 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచిర్యాలలో మున్సిపాలిటీలో 347 పనులకు, నస్పూర్ మున్సిపాలిటీలో 374 పనులకి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 212 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనసాగించడం లేదు అని నడిపెల్లి దివాకర్ రావు ప్రశ్నించారు.
*ఓడిన గెలిచిన తానెప్పుడూ ప్రజల మనిషినని, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు ,గెలిచినప్పుడు పొంగిపోలేదు ,ఎల్లప్పుడు మీ మధ్యలోనే ఉంటా ,మీతో కలిసి ఉంటా మీలో ఒకటేనే ఉంటానని దివాకర్ రావు చెప్పడం జరిగింది..
ఈ క్రమంలో మంచిర్యాల మాజీ చైర్మన్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
