Breaking News

మంత్రి హరీష్ రావును మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి అధ్యక్షులు లక్ష్మణ్ బాబు

187 Views

తెలంగాణ క్రాంతి,ములుగు, ఆగస్టు 31

ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాకుల మర్రి లక్ష్మీనర సింహారావు (లక్ష్మణ్ బాబు) ములుగు జెడ్పీ చైర్ పర్సన్ బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగ జ్యోతితో కలిసి గురువారం ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాతోడ్ లను మర్యాద పూర్వకంగా కలిశారు.
నూతన జిల్లా అధ్యక్ష బాధ్య తలు స్వీకరించిన లక్ష్మణ్ ని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు.
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రి వారికి సూచించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు.పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాల్సిందిగా సూచించారు.
వారి వెంట ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *