(తిమ్మాపూర్ జనవరి 28)
యువత చెడు మార్గాల బాట పట్టకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి సర్పంచ్ మల్లెత్తుల అంజి యాదవ్ యువకులకు సూచించారు..
ఆదివారం గొల్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడా కోటా కింద ఉద్యోగాలు సైతం లభిస్తాయని అన్నారు.గొల్లపల్లి గ్రామానికి చెందిన యువత చెడుబాట పట్టకుండా చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.