రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది :27-01-2024
నిర్లక్ష్యం గా, అజాగ్రత్త గా వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు : మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్.
రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
రోడ్ భద్రత మాషోత్సవాల సందర్బంగా మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కేంద్రం లోని బాలాజీ ఫంక్షన్ లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్., ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు,మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్బంగా డీసీపీ మాట్లాడుతూ,ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఖాకీ చొక్కా విధిగా ధరించడంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల, సైనేజ్ ల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణం కావద్దని డ్రైవర్లకు సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలుగాలని, ప్రమాదాల నివారణకు సహకరిస్తూ ప్రమాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని డీసీపీ కోరారు.
ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని సూచించారు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకునే సమయంలో, దింపే సమయంలో రోడ్డు పక్కన ఆపాలని, తద్వారా ప్రయాణికుల భద్రత లక్ష్యంగా మన్ననలు పొందాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకుండా ఆటో స్టాండ్ లలో మాత్రమే నిలపాలని కోరారు. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ పై శ్రద్ద వహించాలని, అలా కాకుండా భారీ శబ్దాలతో కూడిన మైక్ సెట్లను అమర్చి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించవద్దని కోరారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సామజిక బాధ్యత గా క్షతగాత్రులను దగ్గర లో ఉన్న ఆస్పత్రికి తరిలిస్తే వారిని బతికించుకోవచ్చు అన్నారు. అదేవిదంగా త్వరలో లైసెన్స్ మేళా మరియు ఆటో డ్రైవర్స్ కోసం వైద్య శిబిరం కూడా నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు.
కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి,ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐ నరేష్ కుమార్,సిబ్బంది, ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు.
