ముస్తాబాద్, జూలై 20, ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సైవెంకటేశ్వర్లుతో స్టేషన్ సిబ్బంది చకచక్యంగా వ్యవహరించి దొంగలను అదుపులోకి తీసుకొని వారివద్ద దొంగిలించిన సొత్తు రికవరీ పరుచుకొని అరెస్టు చేయడంలో ముందు వరసలు ఉన్నారు. ఎస్సైవెంకటేశ్వర్లు డ్రింక్అండ్డ్రైవ్ తరచూ చెకప్ చేస్తూ వాహన దారులను మాటల్లో దింపి అనుమానాస్పదంగా ఉండడాన్ని పసిగట్టి నేరస్తులను అదుపులోకి తీసుకొనడంలో నెంబర్ వన్ గా నిలిచారు. ముస్తాబాద్ నామాపూర్ గ్రామాలలో తరచూ ఓ మహిళ వృద్ధమహిళల టార్గెట్ చేసి మద్యం తాగించి మాటల్లొ దింపి వారివద్దనున్న బంగారు ఆభరణాలు చోరీచేసిన మహిళ నేరస్థురాలు నుండి రికవరీ చేసిన పోలీసులు ఇలాంటి నేరస్తులను పట్టుకున్నందుకు జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించినారు, వారిలో ముస్తాబాద్ ఎస్సైవెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, దామోదర్ లను ప్రశంసించి రివార్డులు ఇచ్చినారు. స్టేషన్లో రైటర్ వర్టికల్ ప్రతిభ కనబరిచినందుకు పిసి కుమారుకు ప్రశంస పత్రాన్ని అందించారు.
