ప్రాంతీయం

అంబేద్కర్ స్ఫూర్తితో యువత జ్ఞాన సమాజన్ని నిర్మించాలి

85 Views

తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిది)ఏప్రిల్ 15

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం యువత విజ్ఞానాన్ని పొందించుకునేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకొవాలని ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో,అంబేద్కర్ వాదుల ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అనే పుస్తకాన్ని ఎస్సై చేతుల మీదుగా యువకులకు ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించడంలో ఎన్నో అవమానాలను వివక్షతను ఎదుర్కొన్న అంబేద్కర్ జీవితమే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు.ప్రతి ఒక్కరూ చదువుతోనే విజయాలను సాధించవచ్చని తెలిపారు.పుస్తక పఠనం ద్వారా జ్ఞానవంతులుగా తయారు కావాలని కోరారు. ప్రతి ఏటా కొంతమందికి విజ్ఞానాన్ని పెంచేందుకు జర్నలిస్టు బొడ్డు అశోక్ మహనియుల పుస్తకాలను పంపిణి చేయడం పట్ల అభినందించారు.ఈ కార్యక్రమంలో సినియర్ అసిస్టెంట్ నాగేల్లి శేఖర్,సినియర్ జర్నలిస్టులు గాదే కృష్ణ, హెచ్.మహేందర్, జిలుకర శ్రీధర్,చీకటి జగదీష్ గౌడ్,అంబేద్కర్ వాదులు జ్ఞానవంతులు బుద్ధి జీవులు దాసరి ప్రకాష్,మంద అశోక్ తూళ్ళ వెంకన్న తూళ్ళ వివేక్ మంద రమేష్ బొడ్డు రమేష్ బొటమంచి యాకయ్య,సోమన్న,ఇమ్రాన్ ఖాన్ ముల్క నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7