రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది 25-01-2024
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ.
రోడ్డు భద్రత మాషోత్సవాల సందర్బంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడాళ్ళ వద్ద హెల్మెట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తో కలిసి హెల్మెట్ ఉపయోగం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు చాక్లెట్ లు ఇచ్చి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదన్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ధరించి కారు నడపాలన్నారు.
