ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మూడవత్ రాజేశ్వరి, భర్త భీమ్ సింగ్, వయస్సు- 30 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు తన పెద్ద కూతురైన, మూడవత్ శిరీష, తండ్రి బీం సింగ్, 20 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం, అను ఆమె తేదీ:-23.01.2024 రోజున ఉదయం అందాజ 08:00 గంటల సమయంలో తన కూతురు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లి, తిరిగి సాయంత్రమైనా ఇంటికి రాలేదని, తన కూతురు కోసం బంధువులు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెతికిన తన కూతురి యొక్క జాడ లభించలేదని దరఖాస్తు ఇవ్వగా, ఎస్ఐ ఎన్ రమాకాంత్ గారు “ఉమెన్ మిస్సింగ్” కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.





