నేరాలు

నగదుతో సహా ద్విచక్ర వాహనం చోరీ కేసు నమోదు

88 Views

ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించినటువంటి నగదు తో పాటు ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమకాంత్ కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తి టీఎస్23 సి4875 నెంబర్ గల తన ద్విచక్ర వాహనంతో కిష్టం పల్లి దారిలో ఉన్న రాచర్ల గొల్లపల్లి వైన్స్ వద్దకు వెళ్లాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి సయ్యద్ జావిద్ వాహనం ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పై కవర్లు 84 వేల రూపాయలను ఉన్నాయని ద్విచక్ర వాహనంతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7