పాల్గల్ మండల్ జనవరి 25:ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు.
పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కూడా కాకముందే గండ్రావుపల్లి మాజీ సైనికుని హత్య ఈ రోజు పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై భౌతికంగా నిర్మూలించాలని చూడడం బాధాకరం.
సోదరుడు సామ్యుడు ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని ఇది మంచి పద్ధతి కాదు.
ఎంపిపి శ్రీధర్ రెడ్డి హత్యా ప్రయత్నం విషయంలో స్థానిక సభ్యునిస్పెక్టర్ వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరం ఒక మండల ప్రజా ప్రతినిధి స్థానిక ఎంపీపీ పై దాడి జరిగితే తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తను కూర్చున్న సమయంలో తన పక్కల ఐదారు మంది లేకుంటే ఈరోజు మన పక్కల ఎంపీపీ ఉండేవారా.
ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పోలీసులు వివరించిన తీరు మంచిది కాదు.
గతంలో మేము ఏమి చేయకున్నా అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానల్స్ నేడు మాజీ సైనికుడు హత్య జరుగుతే దానిపై గాని నేడు ఎంపీపీ పై జరిగిన దాడిపై గాని ఎలాంటి న్యూస్ లేదు.
జిల్లా ఎస్పీ కి రిక్వెస్ట్ చేస్తున్నాను చట్టపరంగా మాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది , ఈ కుట్ర వెనుక ఎవరి హస్తముంది కాల్ డేటా పరంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎంపిపి శ్రీధర్ రెడ్డి కి రక్షణ కల్పించాలి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను శ్రీధర్ రెడ్డి కి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
దాడులు చేస్తే సహించేది లేదని శ్రీధర్ రెడ్డి పై డీజిల్ చల్తే ఎలాంటి విచారణ లేకుండా పది నిమిషాలలో ఎలా వదిలేస్తారు అని , డీజిల్ పోసి చంపేయాలని చూసినా నిందితులను వదిలే ప్రసక్తి లేదు అని అన్నారు.
గతంలో ఐదు సంవత్సరాలు ఎలాంటి దాడులు చేయకుండా ప్రజా పాలన అందించామని నేడు కాంగ్రెస్ వచ్చింది దాడులు మొదలయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా వారితో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.