తిమ్మాపూర్ లో విషాదం
చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్
బలవన్మరణం
పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు
ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు , మృతుని తండ్రి దశరథం తల్లి మణెమ్మ పోలీసులకు పిర్యాదు చేశారు,
గొల్లపల్లి గ్రామానికి చెందిన చింతల రోహిత్ , రాజన్నపేట గ్రామానికి చెందిన దండెం లచ్చయ్య అనువారు కంప్యూటర్ ‘హార్డ్ డిస్క్’ విషయంలో తమ కుమారుడు బాబు ను మానసికంగా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని , వారు పెట్టే ఇబ్బందులు భరించలేక ఇంట్లో ఉన్న గడ్డి మందు ఈ నెల 12 వ తేదీన తాగాడని వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించామని
మెరుగైన చికిత్స కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి తీసుకుని వెళ్లి చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయినాడని డాక్టర్లు చెప్పారని వారు మృతదేహాన్ని చూసి శోకసముద్రమయ్యారు,
తన కొడుకు మరణానికి కారణమైన చింతల రోహిత్ దండెం లచ్చయ్య లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదు లో పేర్కొన్నారు, వారి పిర్యాదు మేరకు వారిరువురి పై కేసు నమోదు చేసి నట్టు ఎస్ఐ రామాకాంత్ తెలిపారు,
బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ,
మృతదేహాన్ని పోస్టుమార్టం నుంచి తిమ్మాపూర్ లోని వారి ఇంటి వరకు 300 మంది స్నేహితులు ట్రాక్టర్ పై బాబు ఫోటోతో కూడిన ఫై
ప్లేక్సిని ఏర్పాటు చేసి తమను విడిచి వెళ్ళుతున్నావా నీ స్నేహం మరువం అనే పాట లతో ద్విచక్ర వాహనాలతో భారీ ఎత్తున అంతిమయాత్ర నిర్వహించారు,
వారి ఇంటి నుంచి గ్రామంలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు ,
అంతిమయాత్రలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటి లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్, తిమ్మాపూర్ ఎంపీటీసీ వరదబాబు , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యా నాయక్ , ఉపసర్పంచ్ కోలకాని దేవయ్య, మాజీ ఉపసర్పంచ్ అబ్బణవేణి భీమయ్య, బాబు స్నేహితులు 300 మంది తిమ్మాపూర్ గ్రామస్తులు పాల్గొని బాబు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు,
