కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లలితాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ కి ప్రమాదం.
గొర్రె పిల్ల అడ్డు రావడంతో వాహనంలో ఉన్న డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న మరో ఎస్కార్ట్ వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొనడంతో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి…
ఎమ్మెల్యే ఈటెల చల్లూరు లోని వివాహ వేడుకల్లో పాల్గొని హైదరాబాదుకు వెళుతున్న తరుణంలో లలితాపూర్ వద్ద ప్రమాదం జరగడంతో వెంటనే ఎమ్మెల్యే ఈటెల మరో వాహనం లో హుజురాబాద్ లోని తన నివాసానికి వెళ్ళాడు.