ప్రాంతీయం

బస్సులకోసం పాతబస్టాండులో రాస్తారోకో…

357 Views

ముస్తాబాద్, జనవరి 24 (24/7స్యూస్ ప్రతినిధి): భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అధ్వర్యంలో  రాస్తా రోకో ధర్నా విద్యార్థులతో కలిసి సిరిసిల్ల పాత బస్టాండులొ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బస్సులులేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షణ బస్సులు రాకపోవడంతో కొన్ని క్లాస్ లకు అటెండ్ కాలేక పోతున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని పలుమార్లు ఆర్టీసీ డిపో అధికారులను కోరడం జరిగిందన్నారు. ఇప్పటి కైనా విద్యార్థుల బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని డిమాండ్ చేస్తున్నామనితెలిపారు. బస్సులు వేయని ఎడల విద్యార్థులతో కలిసి డిపో ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆర్టీసీ అధికారులు దీనికి స్పందించి సరియైన సమయంలో బస్సులు నడిపిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, నరేష్, జగన్, తిరుపతి, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *