జైపూర్ మండలం, నర్వ గ్రామపంచాయతీలో నూతనంగా స్థాపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్.
సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని వెంకటేష్ నేత మాట్లాడుతూ సమాజంలో అంబేద్కర్ భావాజాలాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే బాధ్యత అంబేద్కరిస్టులపై ఉన్నదని అంబేద్కర్ ఐడియాలజిని ప్రతి ఒక్క పౌరునికి చేరే విధంగా దళిత బహుజన సంఘాలు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దళితసంఘ నాయకులు గోమాస శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాజు, నాగరాజు, శ్రీపతి, డాక్టర్ నీలకంఠేశ్వర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
