అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మంచిర్యాల లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహా యాగం జరుగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తూముల నరేష్ తెలిపారు.
శుక్రవారం ఎమ్మెల్యే నివాస గృహంలో మీడియా సమావేశం లో వారు మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. పురవీదుల గుండా సాగిన శోభాయాత్ర యాగ స్థలమైన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు చేరుకుంటుందని తెలిపారు. యాగం తో పాటు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు.
20, 21, 22వ తేదీ వరకు యాగ క్రతువు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గ ములో ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం లో రామరాజ్యపాలన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈసమావేశంలో కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
