ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, మండేపల్లి గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ది పుష్ప – మల్లయ్యకు చెందిన బర్రె కరెంట్ షాక్ తో మృతి చెందగా సెస్ తరుపున 40,000 రూపాయలు మంజూరు కాగా అట్టి చెక్కును సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగేలా మానస – రాజు, సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం చేతుల మీదిగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి, నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, బి ఆర్ ఎస్ నాయకులు మీరాల భాస్కర్ యాదవ్, జంగిటి అంజయ్య, గజభింకార్ రాజన్న, గనుప మదన్ రెడ్డి, పడిగేలా రాజు, బుస్స లింగం, మిట్టపెల్లి జవహర్ రెడ్డి, రాగిపెల్లి కిష్టారెడ్డి, కొత్తపెల్లి శ్రీనివాస్, గనప రాము, తదితరులు పాల్గొన్నారు.
