269 Views
ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురష్కరించుకొని గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల పట్ల నిబద్ధత, దేశ పునరుద్ధరణకు సంకేతంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది బ్రిటిష్ వలస పాలన నుంచి దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడాన్ని ఈ రూపంలో సూచిక అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సంఘం కమిటీ, యువజన సంఘం అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.
Poll not found