హైదరాబాద్ జనవరి 19:మంత్రి జూపల్లి కృష్ణారావు.. గాంధీ భవన్
ఒకరి మీద ఒకరు పోటీ పడి సమావేశాలు పెట్టుకుని బావ బామ్మర్ధులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.
ప్రజలు తిరగబడుతారు అని చెప్పుతున్నారు. గడిచిన తొమ్మిదన్నర ఏండ్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీపై తిరగబడి , మీకు కర్రు కాల్చి వాతపెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
అధికారంలోకి వచ్బిన రెండేళ్ల తర్వాత కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. వాటిపై కాంగ్రెస్ మిమ్మలను నిలదీస్తే.. ఇంకా రెండేళ్ల బాలుడు అని బీఆర్ఎస్ నేతలు అప్పుడు సమర్థించుకున్నారు.
ఇప్పుడు నెల కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి?
బీఆర్ఎస్ నాయకుల ఆహాంకార దోరణి, కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగి, వేసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
మీరు పదేండ్లు అధికారంలో ఉండి దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా మీరిచ్చిన హామీలను తుంగలో తొక్కారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతుంది. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం.
కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఎందో ప్రజలకు తెలుసు.
కాంగ్రెస్ పార్టీ రెండు హామీలను నెరవేరుస్తేనే బీఆర్ఎస్ కేటీఆర్, హరీష్ రావు నానా హైరానా పడుతున్నారు.
హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తునారు. కానీ బీఆర్ఎస్ అలవి కానీ హామీలను ఎలా నెరవేరుస్తుండేనో సమాధానం చెప్పాలి.
సీఎం కేసీఆర్ బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చారు అని హరీష్ రావు జూటా మాటలు మాట్లాడుతున్నారు.
7 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు. మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మీరు చేసిన నిర్వాహకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది కదా
ఇంత అప్పుల భారం ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం
రహస్య జీవోలు ఇస్తూ వాటిని దాచి పెట్టారు. కుట్రలు , కుతాంత్రాలు మీకు వెన్నతో పెట్టిన విద్య.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో అదానీ ని కలిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.
పెట్టుబడుల కోసం, పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కలిస్తే తప్పేముందని, అసలు మీకు కామన్ సెన్స్ ఉందా అని కేటీఆర్ ను నిలదీశారు.
మీరు మీ స్వప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగిన మాట వాస్తవం కాదా అని ప్రశించారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే అన్నట్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లులకు మద్దతు ఇస్తూ,… బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగలేదా.
పథకాలు అమలైతే బీఆర్ఎస్ పార్టీ మూత పడుతది కాబట్టే… కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావద్దని బీఆర్ఎస్ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు.
కానీ వారివి పగటి కలలు మాత్రమే. ఆరు గ్యారంటీలు అమలు కావడం గ్యారంటీ… బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగు కావడం గ్యారంటీ.
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు
అందుకే పార్టీని బతికించుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మంతనాలు కొనసాగుతున్నాయి.
గత పదేండ్లలో బీజేపీతో అంటకాగారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు.
ఎవరు ఎన్ని చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతుంది.
అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాం.
ఇకనైనా అబద్దాలు చెప్పడం, తప్పుడు ప్రచారాలు చేయడం మాని , బుద్ధి తెచ్చుకుని మెలగండి అని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని మేము ఎవరిని అడగడం లేదు. అ అవసరం మాకు లేదు. ఎవరైనా వారంతటా వారే వస్తే కాదనం.