Breaking News ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో వడ్డెర కుల బందువులు ఆర్థికంగా రాజకీయంగాఎదగాలి

111 Views

*జిల్లా అధ్యక్షులు సూరదేవరాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా
గంభీరావుపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల వడ్డెర కులస్తులు విచ్చేసి మండల అధ్యక్షులు పిట్ల ఎల్లం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వడ్డెర రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపు లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడికోట రాజు విచ్చేసి మండలంలో గత నాలుగు రోజుల క్రితం మండల మండల వడ్డెర కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ చెల్లదని పాత మండల అధ్యక్షులు పిట్ల ఎల్లం కమిటీ కొనసాగుతుందని దానికి మద్దతుగా వడ్డెర రాష్ట్ర జిల్లా మండలాల వడ్డెర కుల బంధువులు కమిటీ కొనసాగుతుందని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సూర దేవరాజ్ మాట్లాడుతూ మండలంలోని గత నాలుగు రోజుల క్రితం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీ చెల్లదని మండలంలోని పాత కమిటీ మండల అధ్యక్షులు పిట్ల ఎల్లం కమిటీ కొనసాగుతుందని వడ్డెర కులస్తులు కొంతమంది రాజకీయ వ్యక్తులు ఓర్వలేక వడ్డెర కులాల్లో విభేదాలు సృష్టిస్తూన్నారు. వడ్డెర కులస్తులకు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి జిల్లాలోని అన్ని మండలాలలో నూతన కమిటీలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్టీజాబితాలో ప్రతిపాదించగా వడ్డెర కులస్తులు బిసి ఏ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర కులస్తులకు విద్య రంగంలో ఆర్థికంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అవకాశం కల్పించాలని అన్నారు వడ్డెర ప్రజా ప్రతినిధులు మండల అధ్యక్షులు సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల ఎల్లం,  ప్రధాన కార్యదర్శి శివరాత్రి నర్సింలు, పిట్ల వెంకట్ , వడ్డెర  అధ్యక్షులు గోపాల్ , గొల్లని వెంకట్,  నర్సు పల్లపు నరేష్ , శివరాత్రి సతిష్,  అన్ని గ్రామాల వడ్డెర కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna