ప్రాంతీయం

పర్యావరణ పరిరక్షణకు తూట్లు పాఠశాల ఆవరణలో కూల్చివేసిన చెట్లు…

173 Views
ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/31 విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణకై కొంతమంది తూట్లు పొడుస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం ఆరోపించారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్ణయించారు. భవన నిర్మాణం పేరిట స్థానిక దోసలగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లను కూల్చివేయడం దారుణం అన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వము ఒకవైపు చెట్లను నాటుతుంటే  జెసిపి NO T S 17B 2745 సహాయంతో నరికి వేయడం ఎంతవరకు సమంజసం పాఠశాలకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో నూతన అంగన్వాడి భవనం నిర్మించుకోవచ్చు కదా అని అన్నారు పెరిగిన చెట్లను కూల్చివేసిన నరికిన చట్టరీత్యా నేరమని చెప్పే ప్రభుత్వము పాఠశాల విద్యార్థులకు నీడనిచ్చే చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నూతనంగా నిర్మించి అంగన్వాడీ కేంద్ర భవనము పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మూడు పాఠశాల గదులను కూల్చివేసి ఆ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించుకోవాలని కోరారు. జెసిబి ద్వారా చెట్లను నరికి వేసిన సంఘటనపై అధికారులు తక్షణము స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగిందని తెలిపారు.
No Slide Found In Slider.

Poll not found