ప్రాంతీయం

నూతన కార్యదర్శిగా ఎన్నిక

86 Views

సీపీఎం చేర్యాల మండల నూతన కార్యదర్శి గా బండకింది అరుణ్ కుమార్ ఎన్నిక

సిద్దిపేట జిల్లా నవంబర్17

చేర్యాల కార్మిక కర్షక విద్యార్ది యువజన నిరుద్యోగ వృత్తిదారుల సమస్యలపై నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్(  సిపిఎం )పార్టీ శనివారం రోజు జరిగిన సిపిఎం పార్టీ మండల ఎనిమిదో మహాసభలో 13 మందితో మండల కమిటీ ఎన్నుకున్నారని నూతన మండల కార్యదర్శి గా బండకింది అరుణ్ కుమార్ తెలియజేశారు .పాల్గొన్న ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకోవడం జరిగిందనీ ఎన్నికైన మండల కమిటి సభ్యులలో వెంకట మావో (పార్టీ జిల్లా కమిటీ సభ్యులు), గొర్రె శ్రీనివాస్, నాగపురి కనుకయ్య, రేపాక కుమార్, స్వర్గం శ్రీకాంత్, దర్శనం రమేష్, ఎండి కరీం, దొండకాయల సంపత్, మోకు ఇంద్రం, సుర్ణ తిరుపతి గారాలతో మండల కమిటీ ఏర్పడిందనీ రాబోయే రోజుల్లో చేర్యాల ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను రూపొందించుకొని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని వారు అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్