ముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బిట్ల వెంకటేష్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి నిన్న తేదీ 11.1.2024 రోజున వెళ్లి ఈరోజు 12.1.2024 న ఉదయం తన ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆబరణలు నగదు 65 వేల రూపాయలను దొంగిలించారని బిట్ల వెంకటి దరఖాస్తు మేరకు కేసునమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
