Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

165 Views

కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం రోజున మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి ఆరోగ్య సిబ్బంది హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని అన్నారు సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదని రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని 100 పని రోజుల్లో చేపట్టేందుకు కార్యచరణను సిద్ధం చేశామని వారు తెలిపారు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు ఈ కార్యక్రమానికి ఎంపీడీవో బింగి చిరంజీవి ఎల్లారెడ్డిపేట కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సర్పంచులు ముక్క శంకర్ రాజు నాయక్ అజ్మీర మంజుల తిరుపతి నాయక్ వజ్రవ్వ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7