- బి ఎస్ పి గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షునిగా బీసీ నాయకుడు కానుగుల రమణాకర్
సిద్దిపేట జిల్లా జనవరి 23
సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సన్నదం అవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి దిశ నిర్ధేశం చేశారు.అదే విదంగా గజ్వేల్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా బీసీ నాయకులు రమణాకర్ జిల్లా అధ్యక్షులు ఈఆర్ మోహన్ నియమించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి రోమాల బాబు ,జిల్లా ఉపాధ్యక్షులు కటికల ఓం ప్రకాష్ గారు,నియోజకవర్గ ఇంచార్జిలు కొండనోళ్ళ నరేష్ , కెతోజి వినోద్ చారి , మాజీ అధ్యక్షులు మొండి కర్ణాకర్, ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం , ఈసీ మెంబెర్ కనకప్రసాద్, నవీన్, మండల నాయకులు కర్ణాకర్, చంద్రం,వంశి, ప్రసాద్ సిద్ధిపేట నాయకులు ఉమేష్, అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది.
