ముస్తాబాద్, జనవరి12 (24/7న్యూస్ ప్రతినిధి) పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీని బలోపేతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి నాయకులతో సమీక్షించి మండల కమిటీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండలసీనియర్ నాయకలు నామాపూర్ మేర్గు అంజగౌడ్ ను మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని సాల్వాతో సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేర్గు
అంజగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ అలాగే జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతు న్నామన్నారు. నాతో పాటు బిజెపి పార్టీలో వివిధ హోదాలు కలిగిన సీనియర్ నాయకుల మండల నాయకుల వారి వారి సూచనల మేరకు బిజెపి పార్టీని బలోపేతంచేస్తూ నావంతు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా కరెడ్ల మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల జిల్లా సూచనల మేరకు గత రెండు నెలల నుండి మండల అధ్యక్షులు లేనందున మేర్గు అంజ గౌడ్ ను నియోజకవర్గ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించుకుని పూలమాలవేసి సాల్వాతో సన్మానించి స్వీట్లు పంచుకున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సౌల్ల క్రాంతి, చిట్నేని శ్రీనివాసరావు, కుడుకల జనార్ధన్, గోపి, కళ్యాణ్ యాదవ్ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.
