Breaking News

సంబంధం ఈనాటిది కాదు:

145 Views

కామారెడ్డి తో కేసీఆర్ కు ఉన్న సంబంధం ఈనాటిది కాదు: మంత్రి కేటీఆర్

కామారెడ్డి జిల్లా:అక్టోబర్ 07

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

శనివారం కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది.

2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్ అలీ కామారెడ్డి సీటు తీసుకున్నారు. నాడు షబ్బీర్ అలీ బతిమిలాడితేనే కేసీఆర్ ప్రచారానికి వచ్చారు. కామారెడ్డితో కేసీఆర‌్‌కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు.

బీబీపేట మండలంలోని పోసానిపల్లి మా నానమ్మ ఊరు. గంపగోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు.నెర్రెలు బారిన, నెత్తురు పారిన ఈ నేల సస్యశ్యామలం కావాలని కేసీఆర్ ఇక్కడ పోటీకి చేయబోతున్నారు. కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.

కేసీఆర్ పేరు ప్రకటించిన మరుక్షణమే గెలుపు ఖరారైంది. ఎమ్మెల్యే టికెట్లు రాని కులాల వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది మా సిద్ధాంతం. తెలంగాణలో గెలవగానే మహారాష్ట్రలో గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాం. దమ్మున్న నాయకుడు కావాలని మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *