రామగుండం పోలీస్ కమీషనరేట్
తేది 08-01-2024
*గంజాయి కేసులలో ఆరుగురు (06) బైండొవర్
రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు కమీషనరేట్ పరిధిలో నిర్వహిస్తూన్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హాజీపూర్, బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్నా
1.దుర్గం. రాజ్‌కుమార్ s/o లేట్ మల్లేష్, వయస్సు 23, హాజీపూర్ మండలం పెదంపేట్ గ్రామం,
2.మంద. హృతిక్, నర్సయ్య వయస్సు 21, హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామం,
3.చిట్యాల. సుధాకర్ s/o పోచయ్య వయస్సు 23, కర్ణమామిడి గ్రామం, హాజీపూర్ మండలం.
4.SK. ముజ్జు @సల్మాన్ s/o మహమూద్ వయస్సు 25 ముస్లిం ఆటో డీలర్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి
5.చీమల సాగర్ S/o రాంబాబు, వయస్సు 20, ST కోయా, కూలీ, బాబు క్యాంప్,బెల్లంపల్లి
6.MD. తాజ్ @ లాడెన్ S/O కలీం, వయస్సు 22, ముస్లిం, కూలీ, మార్కెట్ ప్రాంతం,బెల్లంపల్లి, లని పట్టుకొని హాజీపూర్, బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లలో అప్పగించడం జరిగింది.
గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు భవిష్యత్తులో తిరిగి తప్పు చేయకుండా ముందస్తుగా చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నట్లు, మరోమారు గంజాయి అక్రమ రవాణా కి పాల్పడితే జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది అని సీపీ హెచ్చరించారు. ఎవరైనా అనుమానితులు అమ్ముతునట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని గంజాయి రహిత కమీషనరేట్ గా తీర్చిదిద్దాడం లో అందరు భాగస్వామ్యం కావాలని కోరారు.
