డివిజన్ పరిధిలో అభివృద్ధికి పెద్దపీట కార్పొరేటర్ పండాల సతీష్
జనవరి 8
కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా.. డివిజన్ పరదిలో అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తున్నమని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని న్యూ గౌతంనగర్ లో ఇటీవల నిర్మించిన యూజీడీ పనులను ప్రారంభించబోయే రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఏఈ పవన్ తో కలసి పర్యావరక్షించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఫతేనగర్ డివిజన్ పరధిలోని అన్ని బస్తిలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తునమాని, దీనివల్ల బస్తీరూపరేఖలు మారనున్నాయి అన్నారు. అనంతరం కాంట్రాక్టర్ తోమాట్లాడి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి కావడంతో, రూ. నలబై లక్షలతో నిర్మించ తలపెట్టిన అంతర్గత విడిసీసీ రోడ్ల నిర్మాణా పనులు త్వరలో ప్రారంభిస్తామని అంతేకాక డివిజన్ పరదిలో పలు బస్తిలలో పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందివ్వటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ సురేందర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
