నేరాలు

రాచర్ల గొల్లపల్లిలో దొంగల బీభత్సం

176 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో దొంగల బీభత్సం సృష్టించి బంగారము వెండి కొంత నగదును ఎత్తుకు వెళ్లారని బాధితుడు తెలిపారు.బాధితుడు తెలిపిన వివరణ ప్రకారం తడకొండ మహిపాల్ అనే వ్యక్తి బతుకమ్మ పండగ పర్వదిన సందర్భంగా ఇంటికి తాళం వేసి అత్తగారింటికి వెళ్ళాడు. సోమవారం ఉదయం తన ఇంటికి వచ్చి చూసుకునేసరికి గుర్తి తెలియని వ్యక్తులు ఇంటి దర్వాజాలు, బీరువా దర్వాజాలు పగలగొట్టి 4 తులాల బంగారము, 10 తులాల వెండి, 2 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *