ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన సంగ మల్లయ్యకు చెందిన సుమారు ఆరు ట్రాక్టర్ల పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్దమైంది.గ్రామస్థుల కథనం ప్రకారం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గడ్డివాము నుండి మంటలు చెలరేగాయి.ఇది గమనించిన చుట్టుపక్కల నివాసముంటున్నవారు అరుపులుకేకలు వేయగా చిన్నచిన్న బిందెలతో మంటలను చల్లార్చడానికి ప్రయత్నించిన్నప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.వెంటనే ఇట్టి విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొని మంటలార్పారు.బాధిత రైతు సంగ మల్లయ్యకు సుమారుగా 50 వేల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది.మల్లయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
