యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినంతోపాటు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
