మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం పరిశీలించారు.
అధ్వాన్నంగా ఉన్న రోడ్డు కు మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలు మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టగా ఆదివారం ఆయన పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఆధునిక పద్దతిలో డాంబర్ షీట్ వేయడం జరుగుతుందని ప్రేమ్ సాగర్ రావ్ తెలిపారు. చెన్నై నుంచి దాదాపు 15లక్షల రూపాయల తో డాంబర్ షీట్ తో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఓవర్ బ్రిడ్జి మీద ప్రయాణం ప్రమాదకరం అనుకునే వాహనచోదకులకు సేఫ్ జర్నీ అనే విధంగా రోడ్డు పనులు చేస్తున్నట్లు వివరించారు. అలాగే సంక్రాంతి పర్వదినంనాటికి మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి తాగునీరు ప్రతి రోజు రెండు గంటలపాటు సరఫరా చేస్తామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
