ప్రాంతీయం

ఇన్స్పైర్ అవార్డులో విద్యార్థుల ప్రతిభ…

119 Views

ముస్తాబాద్ జనవరి 9, 2022-2023 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన్స్పైర్ మనక్- అవార్డ్స్ సెలెక్టెడ్ లిస్టులో ZPHS ముస్తాబాద్ పాఠశాల విద్యార్థులు కావటి అక్షయ (7th), చెక్కపల్లి దీక్షిత (8th) ఎంపికయ్యారు. వీరు నగదు బహుమతి అందుకోనున్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి, వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు.. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ప్రతి ఏటా దేశంలో 6 నుండి 10.వ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్-మనక్ పేరిట పోటీలు నిర్వహించి, అవార్డులను అందిస్తున్నాయి. విద్యార్థులను *బాల శాస్త్రవేత్తలుగా* తీర్చిదిద్దడమే ఇన్స్పైర్- మనక్ వైజ్ఞానిక ప్రదర్శన ముఖ్య ఉద్దేశం.
పాఠశాల విద్యార్థుల్లో వినూత్నమైన ఆలోచనలను రేకెత్తించి…వారిని పరిశోధన వైపు మళ్ళించేవే ఈ ప్రతిష్టాత్మక పోటీలు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్, సైన్స్ టీచర్లు సుజాత, ఆనందం, ఉపాధ్యాయ బృందం.. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు, ఆశీస్సులు అందించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్