ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మే 13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన శ్యాగ రుచిత (20) అనే యువతి సడిమెల వంశీ,శ్యాగ సుహిత లు ద్విచక్ర వాహనంపై గూడెం నుంచి బంజేరుపల్లి గ్రామానికి వస్తుండగా హనుమాజీపేట కు చెందిన లారీ డ్రైవర్ శివకుమార్ లారీ వడ్ల లోడుతో అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొట్టిన సంఘటనలో రుచిత అక్కడికక్కడే చనిపోగా, సుహిత, వంశీలకు తీవ్ర గాయాలయి ఎల్లారెడ్డిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతురాలు తండ్రి జనార్దన్ శనివారం రోజున ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉపేందర్ తెలిపారు.
