ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆశా కార్యకర్తల సమస్యలను పట్టించుకోక పోవడం ఏంటని తీవ్రంగా మండిపడిన బాధ నరేష్ ఏపనికైన నిర్ణీత జీతాలు ఉంటాయని, కానీ ఆశా కార్యకర్తలకు సమయ నిబద్ధత ఏమాత్రం లేకుండా వారిపై అధిక భారం మోపుతూ, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతిఇంట్లో వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న .. చివరికి అంశాలకు కనీసం హెల్త్ కార్డులు లేవని వెల్లడించారు. కరోనా సమయంలో ఆశా కార్యకర్తలు చేసిన సేవలు సీఎం కేసీఅర్ మరిచిపోయారని, వారు గుర్తు చేశారు పై విషయాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ..మంత్రి కేటీఆర్ ఆశాలకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
