మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సీపీఐ నేత అశోక్
డిసెంబర్ 30
సిద్దిపేట జిల్లా చేర్యాల జనగామ నియోజకవర్గం పరిధిలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బీసీ-కురుమ సామాజికవర్గానికి చెందిన తమకు అవకాశం కల్పించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మిత్రపక్షంగా సిపిఐ పార్టీ అధిష్టానం చేసిన సూచన మేరకు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడైన తాను జనగామ నియోజకవర్గం అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తాను ఎంతో కష్టపడి పనిచేశానని అన్నారు.
ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున ప్రభుత్వం నామినేటెడ్ పదవు లు చేపట్టడంతో హర్షించదగ్గ విషయమన్నారు. తాను చేర్యాల ప్రాంత బిడ్డగా రాజకీయ పరిస్థితులపై ఎంతో అవగాహన కలిగి ఉండి ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికై పాటుపడుతున్న తాను కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మా గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చర్మ న్ గా తనకు అవకాశం కల్పించి గొల్ల కురుమలకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఐ డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి, శేఖర్, మల్లేశం ఉన్నారు
