Breaking News

బస్సులు నడపాలని ధర్నా

293 Views

విద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలని బస్ డిపో ముందు ధర్నా – ఏబీవీపీ

డిసెంబర్ 30

సిద్దిపేట జిల్లా ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ఈ యొక్క నూతన ప్రభుత్వము అవసరాల కొరకు స్వార్థం కొరకు కేటాయించిన స్కీముల కారణంగా సామాన్య ప్రజలు విద్యార్థులు ఇబ్బందులకు గురి కావస్తుంది ఎందుకు అంటే సిద్దిపేట పట్టణానికి చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వేలాదిగా చదువుకోవడానికి వస్తుంటారు నెలల గా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి బస్సు పాసుల డబ్బులను చెల్లించినప్పటికీ విద్యార్థులు అధిక సంఖ్య బస్సులలో ఉండటం వల్ల ఎక్కలేని పరిస్థితి కాబట్టి విద్యార్థులు రాత్రులు కూడా బస్సుల కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాబట్టి విద్యార్థుల కొరకు ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్సులను విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు

అలాగే శాంక్షన్ అయినటువంటి 80 బస్సుల నుండి సిద్దిపేట జిల్లాకు 20 బస్సులను సిద్దిపేట జిల్లా విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలని  డిమాండ్ చేశారు లేనియెడల ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య,పవన్, ఏబీవీపీ నాయకులు హరీష్,చరణ్,పర్శారాం , నందు, రాహుల్, శంకర్, రవళి, శిరీష తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *