ఉచిత హెల్త్ చెకప్ క్యాంపు కు విశేష స్పందన కనిపించింది కరీంనగర్ లో ఉన్న వైద్య విజ్ఞ్యాన సంస్థ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కు సంబంధించిన వారికి ప్రతి సోమవారం ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపు కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ సోమవారం శ్రీకారం చుట్టారు.ప్రతిమ మెడికల్ కళాశాల వారు పంపిన బస్ లో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఎల్లారెడ్డిపేట జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలవద్ద అందరిని పొగుచేసి ఒగ్గు బాలరాజ్ యాదవ్ తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఒగ్గు బాలరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 8 గంటలకు ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)వారి బస్ గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల వద్దకు వస్తుందని ఇందులో ఆరోగ్య పరీక్షలు చేయించుకోదలచిన వారు వారి వెంట ఆధార్ కార్డు,రేషన్ కార్డు,ఆరోగ్య శ్రీ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన గ్రామప్రజలకు సూచించారు. MRI స్కానింగ్ అవసరం ఉన్నవారికి 50 శాతం డిస్కౌంట్ తో వైద్య కళాశాలలో పరీక్షలుచేయించడం జరుగుతుందని అన్నారు.ఆపరేషన్ లను ఉచితంగా చేస్తారని తెలిపారు.ఒగ్గు బాలరాజ్ యాదవ్ వెంట సముద్రలింగపూర్ మాజీ సర్పంచ్ పూజం భూమారాజం,ఇంచార్జి వెన్ను బాలశంకర్ లు ఉన్నారు.




