Breaking News

పార్లమెంట్ స్థానం కేటాయించాలి

375 Views

భువనగిరి పార్లమెంట్ స్థానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  కి కేటాయించాలి

డిసెంబర్ 30

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట. జనగామ ప్రాంత అభివృద్ధిపరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, మొక్కవోని దీక్ష పట్టుదలతో, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, నేనున్నానంటూ ప్రజల అవసరాల అభివృద్ధికై, నిరంతరాయంగా శ్రమిస్తున్న జిల్లా అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని,దూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ జనగామ దూల్మిట్ట ప్రజల తరఫున టీపిసిసి కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో, జనగామ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూనే, ఎన్నో ఆటంకాలు ఎదురైనా, గత అధికార పక్షంతో తలబడి నిలబడి ఉన్నాడు. నేడు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ప్రజాభివృద్ధి కొరకు, కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకేల్లుతున్న మహా నాయకుడు. ప్రజలందరి చేత ప్రజాభివృద్ధిపరునిగా పేరుగాంచిన నాయకుడు.

ఈ ప్రాంతాములో అవినీతి అంటే సహించని వ్యక్తి తాను, కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ, కోరుకుంటున్నాము.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *