ఎల్లారెడ్డి పేట మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం రాంచందర్ నియమితులయ్యారు. తహశీల్దార్ గా విధులు నిర్వహించిన జయంత్ కుమార్ కు బదిలీ అయినా ఉత్తర్వులు ఇంకా వెలువడ లేదని తెలిసింది.ఆదిలాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డి పేట కు బదిలీ పై వచ్చిన రాంచందర్ శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు.బుదవారం నాడే విధుల్లో చేరాల్సి ఉండగా అమావాస్య ఉండగా శుక్రవారం నెల పొడుపు కావడం తో నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగ సోమవారం నుండి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనున్నారు.
