(ఇల్లంతకుంట డిసెంబర్ 25)
మానకొండూర్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది..
ఈ ఘటనలో కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ (35) అక్కడికక్కడే మృతి…
వారం రోజుల క్రింద తన మామ చనిపోగా కుటుంబ వ్యవసాయ పనులను చూసుకుంటూ అత్తగారి ఇంటి లోనే ఉంటున్నాడు
వ్యవసాయ పనుల్లో భాగంగా వరి నారును ట్రాక్టర్ పై తీసుకు వచ్చే ప్రయత్నం లో కేనాల్ కాలువపై వెళ్లగా అదుపుతప్పి,అందులో పడిపోయింది.మృతునికి భార్య సంధ్య, ఒక కుమారుడు వున్నారు..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు.