24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 25)
క్రిస్మస్‌ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు జన్మదినాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తుబోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.
