(తిమ్మాపూర్ అక్టోబర్ 10)
తెలంగాణ లో ఎన్నికల కోడ్ దృశ్య పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తగిన రసీదులు,పత్రాలు చూపించాలని లేనియెడల నగదును సీజ్ చేస్తామని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీ లో భాగంగా అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు…




