ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి
కత్తుల భాస్కర్ రెడ్డి
డిసెంబర్ 24
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కుల మత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి సూచించారు
గతంలో 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండేది ఎందుకంటే ప్రజాప్రతినిధులు పోటీ చేయడానికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి అందువల్ల ఓటు హక్కు కనీసం 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారు 1 జనవరి 2024 లోపు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్యానికి తోడ్పాటు అందించాలని కోరారు యువతలో చైతన్యం కల్పించారు జనవరి 5వ తేదీ చివరి తేదీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు లేని 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవచ్చని సూచించారు
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఓటర్ల మీదనే ఆధారపడి ఉంటుందని ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అంతే అవసరమని సూచించారు
