రాజకీయం

ఇల్లందు అన్నపూర్ణ కు అండగా నిలిచిన కేటీఆర్

248 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 24)
హైదబాద్:

ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది.
ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్ కి చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి నాలుగు సార్లు దరఖాస్తు ఇచ్చానని తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం మినహా ఇంకా మిగిలిన సమాచారం కానీ స్పందన కానీ ఏ మాత్రం లేదని తెలిపింది. తన ఆర్థిక కష్టాలను, తన పిల్లల చదువుల ఇబ్బందులను, తన దుర్భరమైన జీవితాన్ని వివరించినా ప్రజా దర్బార్ లో ఊరట దక్కలేదు అన్నది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజాదర్బార్లో నాలుగు సార్లు దరఖాస్తులు పెట్టుకున్న దయ తలచలేదని, అసెంబ్లీ వద్దకు వెళ్లి సిఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని తెలిపింది.

అయితే చివరగా తెలంగాణ భవన్ వెళ్లి కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిస్తే మీకు కొంత అండ దొరుకుతుందని చెబితే తెలంగాణ భవన్ చేరుకున్నాను. కేటీఆర్ ని కలిసిన వెంటనే ఆయన ఆమె బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి. సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్ కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *