రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల బాల్కనీ వైన్స్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపించారు. మండల కేంద్రంలోని బాల్కనీ వైన్స్ షాప్ లో ఆదివారం రోజు అల్లం లక్ష్మణ్ అనే వ్యక్తి ఎంసీ డైట్ మందు బాటిల్ కొనుగోలు చేయగా కల్తీ వచ్చింది. వెంటనే షాపు యాజమాన్యం వద్దకు వెళ్లి కల్తీ మద్యం వచ్చిందని తెలపగా దానికి బదులు మరొక బాటిల్ ఇవ్వగా అందులో కూడా కల్తీ మద్యం రావడంతో వైన్స్ నిర్వాహకులను ఇదేంటి అని ప్రశ్నించగా నోటికొచ్చినట్లు మాట్లాడాలని లక్ష్మణ్ ఆరోపించారు. ఇట్టి విషయానికై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ ను వివరణ కోరగా మా సిబ్బందిని వైన్స్ కు పంపించి మద్యాన్ని శాంపిల్ స్వీకరించి కల్తీ జరిగినట్లయితే వైన్ షాప్ మీద శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
