ముస్తాబాద్, డిసెంబర్ 8 (24/7న్యూస్ ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మాటి రాజమల్లు తన యొక్క వ్యవసాయ పొలంలో జై కేసీఆర్ జై కేటీఆర్ అనే పేరుతో వడ్లుపోసి వరినారును మొలకవెత్తే విధంగా చేసి తనయొక్క అభిమానాన్ని చాటుకున్నాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవిధంగా రైతులను తెలంగాణ ప్రజలను సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ఏ విధంగా చేసిందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి దిశగా కొనసాగించాలని కోరారు.
