ముస్తాబాద్, సెప్టెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రభుత్వ సొమ్మును పక్కదారి వ్యవహారంపై చర్యలు తీసుకోకపోగా ఆ అధికారులను జిల్లా పంచాయతీ రాజ్ అధికారి మరోచోటకు బదిలీచేసి చేతులు దులుపుకున్నారు. అంతేకాకుండా జిల్లా పంచాయతీరాజ్ అధికారి బదిలీపై వెళ్లడం అనేక అనుమానాలకు దారితీస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్తనారు. తప్పుచేసిన అధికారులను ఎంక్వయిరీ పేరుతో కాలయాపనచేసి ఎట్టకేలకు వేములవాడ ఎంపివొ అధికారి శ్రీధర్ గౌడ్ చేత ఎంక్వయిరీ జరిపించారు. వేములవాడ అధికారి ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో ఎంక్వయిరీ చేయగా ముమ్మాటికి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న అధికారిపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ధారించారు. అవేం పట్టించు కోకుండా మరో అధికారితో ఎంక్వయిరి చేపిస్తానంటూ జిల్లాపంచాయతీరాజ్ అధికారి వ్యవహారం తీరుపై అనేకమైన అనుమానాలకు తావిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.




