ప్రాంతీయం

అసత్య ప్రచారాలు మానండి కాంగ్రెస్…

362 Views
 ముస్తాబాద్, డిసెంబర్ 8 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, ఎంపిటిసిగుండెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనీ నమ్మి కేకే మహేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో బిఅర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు మాను కోవాలని హెచ్చరించారు. సి.ఎం. రిలీఫ్ ఫండ్ ఆగిపోతాయని అసత్య ప్రచారాలు చేయoడని కార్యకర్తలను రెచ్చగొట్టడం సరి కాదని తెలిపారు. బిఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాలు ఒక్కొక్కటి తొలుతగా ముఖ్యమంత్రిగా కుర్చీపై కూర్చున్న రోజే 83వేల కోట్లు విద్యుత్ బకాయి స్వాహా, కాలేశ్వరం అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేసిందే కాక మింగిన వేలకోట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం కక్కిస్తుందని అన్నారు. ఇక కొద్దికాలం ఓపిక పడితే గడిచే ఐదు సంవత్సరాలలో మీరుచేసిన దోపిడీలను బయటపెట్టే రోజులొస్తున్నాయని డొక్కాలాగిత అన్ని బయటపడతాయని ఇక ముందుంది ముసుర్ల పండుగ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంబడే తొలిసంతకం ఆరు గ్యారెంటీ లపై చేశారని అన్నారు. నాడు ఎవరికి ప్రవేశంలేని ప్రగతి భవన్ ను ప్రజాభవనం పేరుమార్చి నేడు సచివాలయంకు సామాన్య జనాలకు సైతం ప్రవేశం ఉండే విధంగా చేసినకాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓరగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, రంజాన్ నరేష్, ఏదునూరి భానుచందర్, బండి శ్రీకాంత్, ఆగుల్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *